AP : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు

AP : ఏపీలో రోజువారీ పని గంటలు పెంపు
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పని గంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటల నుండి 10 గంటలకు పని గంటలు పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించింది. షాపులు, కంపెనీలు, ఫ్యాక్టరీల్లో రోజువారీ పని గంటలు పెంచే సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. ప్రస్తుతం రోజుకు 8 పని గంటలు ఉండగా, దానిని 10 గంటలకు పెంచారు. వారానికి 48 పని గంటల్లో మార్పు లేదు. ఫ్యాక్టరీల్లో బ్రేక్ టైమ్‌తో కలిపి 12hrs మించకూడదు. ప్రతి 6hrకి రెస్ట్ ఇవ్వాలి. మహిళల నైట్ షిఫ్ట్‌(రా.7, రా.8.30-ఉ.6)కు వారి అనుమతి తప్పనిసరి. సంస్థ వారికి ట్రావెల్ సదుపాయం, సెక్యూరిటీ కల్పించాలి. దుకాణాలు, సంస్థల్లో 20 మందిలోపు సిబ్బంది ఉంటే చట్టం నుంచి మినహాయింపునిచ్చారు. అయితే నిబంధనలను మాత్రం పాటించాల్సి ఉంటుంది.

Tags

Next Story