Omicron cases : ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

Omicron cases : ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు
Omicron cases : తెలుగు రాష్ట్రాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మరింతగా ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో మరింతగా ప్రతాపం చూపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1052 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్‌ తర్వాత మొదటిసారి తెలంగాణలో కోవిడ్‌ కేసులు సంఖ్య వెయ్యి మార్కు దాటింది. అలాగే కొత్త వేరియంట్‌ కేసులు సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 10 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 144కు చేరింది. ఎట్‌ రిస్క్‌, నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి 127 మంది శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.

ఏపీలోనూ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరో ఏడుగురికి ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కు చేరింది. ఒమిక్రాన్ సోకిన వారిలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 37 మహిళ ఒమన్ నుంచి డిసెంబర్ 23న... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 31 ఏళ్ల మహిళ ఒమన్ నుంచి డిసెంబర్ 19న... కృష్ణా జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువకుడు సౌత్ సూడాన్ నుంచి డిసెంబర్ 23న... పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 33 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 25న యూఏఈ నుంచి... తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 46 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 29న యూఏఈ నుంచి... కృష్ణా జిల్లాకు చెందిన 54 ఏళ్ల వ్యక్తి డిసెంబర్ 28న యూఏఈ నుంచి, కృష్ణా జిల్లాకే చెందిన 28 ఏళ్ల యువకుడు డిసెంబర్ 20న గోవా నుంచి ఏపీకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొవిడ్‌ పరిస్థితులను తామే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, చికిత్స, మౌలిక సదుపాయాలు, వసతులు తదితర అంశాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. నేటినుంచి వరకువల్‌ గా హైకోర్టులో కేసుల విచారణ జరగనుంది. కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్‌ కళాశాలలు మినహా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ సంస్థలకు సెలవులు ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story