Vijayawada : బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి షెడ్యూల్ విడుదల

Vijayawada : బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి నవరాత్రి షెడ్యూల్ విడుదల
X

ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల ఉత్సవాలను అక్టోబర్ 3 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. మూలా నక్షత్రం రోజు, అక్టోబర్ 9న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దీంతో ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడ కలెక్టర్ సృజన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ ఏడాది జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Next Story