CM Chandrababu : సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం

CM Chandrababu : సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం
X

నిన్న కొవ్వూరు సీఎం చంద్రబాబు పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ కిరాణా దుకాణం వద్ద ఆగి వ్యాపారం ఎలా ఉందంటూ వాకబు చేశారు సీఎం చంద్రబాబు. కిరాణా దుకాణాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవచ్చంటూ దుకాణ యజమానికి సీఎం సూచనలిచ్చారు. ఆ దుకాణం వద్దే వస్తువులు కొనుగోలు చేస్తున్న చర్మకారుడు పోశిబాబును ఆప్యాయంగా పలకరించారు ముఖ్యమంత్రి. చర్మకార వృత్తిలో అవసరమైన ఉపకరణాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావని సీఎం ఆరా తీశారు. పోశిబాబు చెప్పిన అంశాలను ముఖ్యమంత్రి ఆసక్తిగా విన్నారు. గతంలో వ్యాపారాలు చేసుకునే వారిని బెదిరించే వారని..ఇప్పుడు ఆ బెదిరింపులు తగ్గాయన్నారు దుకాణదారుడు. చెప్పులు కుట్టడంతో పాటు మేదరపని కూడా చేస్తానని సీఎం కు వివరించారు పోశిబాబు. డప్పు కొట్టేవాళ్లకు ఇచ్చే పెన్షన్ అందుతోందా అంటూ పోశిబాబును అడిగారు సీఎం. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోనే వెయ్యి రూపాయల పెన్షన్ తీసుకున్నానని.. ఇప్పుడు రూ. 4 వేలు తీసుకుంటున్నానని సీఎంకు చెప్పారు పోశిబాబు. మీ కుల వృత్తిని కూడా చూస్తానంటూ పోశిబాబును తన కారులో కూర్చొబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకెళ్లారు చంద్రబాబు. కారులోనే మార్గమధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు- చర్మకారుడు పోశిబాబు మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. సుమారు రెండు కిలో మీటర్ల మేర పోశిబాబును తన కారులో వెంటపెట్టుకుని చర్మకారుని ఇంటికి వెళ్లారు చంద్రబాబు. ముఖ్యమంత్రి పక్కన కూర్చొనే అవకాశం తనకు దేవుడిచ్చిన వరమన్నారు పోశిబాబు. వైసీపీ ప్రభుత్వంలో నాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.. రాష్ట్రం అడుగంటి పోయిందన్నారు పోశిబాబు. అందరి జీవన ప్రమాణాలు మెరుగవ్వాలనేదే తన ప్రయత్నమని చంద్రబాబు వెల్లడించారు.

Tags

Next Story