IPS Sanjay : అవినీతి ఆరోపణల కేసులో ఐపీఎస్ సంజయ్‌కు రిమాండ్

IPS Sanjay : అవినీతి ఆరోపణల కేసులో ఐపీఎస్ సంజయ్‌కు రిమాండ్
X

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్‌ అధికారి సంజయ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోయిన ఆయనకు వచ్చే నెల 9 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. సీఐడీ, ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌కు డైరెక్టర్ జనరల్‌గా సంజయ్ పని చేస్తున్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ కోసం ఒక యాప్ అభివృద్ధి చేయడానికి, అలాగే ఎస్సీ - ఎస్టీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కేటాయించిన నిధులను ఆయన దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు ఆదేశాలు

ఈ కేసులో గతంలో సంజయ్‌కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా దిగువ కోర్టులో లొంగిపోవాలని ఆయనను ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం నాడు సంజయ్ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. విచారణ అనంతరం కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

Tags

Next Story