YSRCP : కక్ష సాధింపు కేసులా.. సజ్జల మాటల్లో నిజముందా..?

YSRCP : కక్ష సాధింపు కేసులా.. సజ్జల మాటల్లో నిజముందా..?
X

తప్పు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే అది కక్ష సాధింపు అవుతుందా. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి ఆడవారిని బూతులు తిట్టిన నేతలను వదిలిపెట్టాలా. ప్రశ్నిస్తే దాడులు చేసి, ఇంకొన్ని చోట్ల చంపేస్తే వారిని విడిచిపెట్టాలంట. ఇప్పుడు వైసీపీ అగ్ర నేతలు ఇదే చెబుతున్నారు. వల్లభనేని వంశీ ఏ స్థాయిలో రెచ్చిపోయి చంద్రబాబు నాయుడి ఫ్యామిలీని అవమానించారో చూశాం. నిండు అసెంబ్లీ సాక్షిగా మహిళలను అవమానించాడు ఇదే వంశీ. టీడీపీ నేతలను వేధించాడు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయించాడు. కానీ జగన్ వంశీపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఆయన మీద అప్పట్లో టీడీపీ కేడర్ కేసులు పెట్టినా సరే పోలీసులు పట్టించుకోలేదు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వంశీ మీద పాత కేసుల్లో అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వంశీ ఏ స్థాయిలో రెచ్చిపోయి అరాచకాలు సృష్టించాడో ఏపీ ప్రజలు మొత్తం చూశారు కదా. అందుకే ప్రజలు అత్యంత దారుణంగా ఓడించారు కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి మీద నమోదైన కేసుల్లోనే ఇప్పుడు అరెస్ట్ చేస్తుంటే కక్ష సాధింపు అని అంటున్నారు సజ్జల. నిన్న లీగల్ సెట్ టీమ్ తో ఆయన జూమ్ మీటింగ్ పెట్టారు. అందులో రెడ్ బుక్ దారుణంగా అమలు చేస్తున్నారు.. అన్యాయంగా వైసీపీ నేతలపై కక్ష సాధింపు కేసులు పెడుతున్నారని పెద్ద డైలాగులు కొట్టారు.

ఒకవేళ కక్ష సాధింపు కేసులు అయితే వల్లభనేని వంశీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టుల్లోనే తాను తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా. కానీ ఎందుకు అలా చేయట్లేదు. ఎందుకు భయపడి పారిపోతున్నాడు. టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ వంశీ మాత్రం బయటకు రావట్లేదు. తప్పు చేయని వారు ఎందుకు భయపడుతారు. ఆ విషయం సజ్జలకు తెలియనిది కాదు. కానీ సింపతీ డ్రామా కోసం ఇలా కక్ష సాధింపు అంటున్నారు. వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ స్థాయిలో రెచ్చిపోతూ అశాంతి రాజేయడానికి ప్రయత్నిస్తున్నారో చూస్తున్నాం కదా. మరి అలాంటి వైసీపీ నేతల కేసులు పెట్టకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సామాన్య ప్రజలు.

Tags

Next Story