Andhra Pradesh : ఏపీలో మావోయిస్టుల కలకలం.. చంద్రబాబు జాగ్రత్త

సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మావోయిస్టులకు టార్గెట్ అయ్యారా అని అనుమానాలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు అంటే చరిత్రలో మావోయిస్టులకు ఒక టార్గెట్ లాగే ఉంటూ వస్తున్నారు. ఎన్నో మంచి పనులు చేసినా సరే చంద్రబాబు నాయుడు ని వాళ్ళు టార్గెట్ చేయడం నిజంగా దారుణం అనే చెప్పాలి. మొన్న విజయవాడలో, ఏలూరులో, రాజమండ్రిలో పెద్ద ఎత్తున మావోయిస్టులు అరెస్టు కావడం తీవ్ర కలకలం రేపింది. అడవిలో ఉండాల్సిన అన్నలు సడన్గా ఇలా పట్టణాల్లో ప్రత్యక్షం కావడం ఏంటని సర్వత్ర చర్చ జరుగుతుంది.
అయితే ఈసారి కచ్చితంగా టార్గెట్ చంద్రబాబును చేసుకుని వచ్చినట్లు ఇంటెలిజెన్స్ విభాగం ఆరా తీస్తోంది. ఎందుకంటే కేంద్రంలో ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం రావడంలో సీఎం చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. వాళ్ళిద్దరు సపోర్టు లేకపోతే ఈసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆపరేషన్ కగార్ ను స్టార్ట్ చేసింది. ఇప్పటికే వందల మంది మావోయిస్టులను లేకుండా చేసింది. బస్తర్ లో మావోయిస్టుల ఆనవాళ్లు లేకుండా ఈ ఆపరేషన్ కదా తుడిచివేసింది. ఇలాంటి ఆపరేషన్ రావడానికి సీఎం చంద్రబాబు నాయుడు కీలక కారణం అని మావోయిస్టులు ప్రధానంగా నమ్ముతున్నారు.
అందుకే చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పుడు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో 2003లో అలిపిరిలో జరిగిన మావోయిస్టు బాంబు బ్లాస్ట్ దాడి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. కారు అంత ఎత్తున ఎగిరిపడిన సరే సీఎం చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి దయవల్ల బతికి బయటపడ్డారు. ఆయన అప్పుడు తృటిలో తప్పించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏపీని ఈ స్థాయిలో అభివృద్ధి చేయగలుగుతూ ముందుకు తీసుకెళుతున్నారు. ఆయన లాంటి విజనరీ లీడర్ ఏపీకి చాలా అవసరం. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, ఆయనకు భద్రతను మరింత పెంచాలంటూ కోరుతున్నారు కూటమినేతలు. మావోయిస్టుల నుంచి ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదు అనే సంకేతాలు వచ్చేదాకా ఇంటెలిజెన్స్ విభాగం అన్ని కోణాల్లో గస్తీ కాయాలంటున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

