Chandrababu Naidu : ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారేనా..?

Chandrababu Naidu :  ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారేనా..?
X

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న కాపు నేత, ఉద్యోగుల సంఘ నాయకుడు పరుచూరి అశోక్ బాబు పదవీకాలం ముగీయనుంది. ఈ స్థానంలో అదే జిల్లా, అదే సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ పేరు ఖరారయినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే జనసేన నుంచి నాగబాబు పేరు కూడా దాదాపు ఖరారైనట్టే అంటున్నారు. ఈ ఇద్దరికీ స్థానం కల్పించేట్టైతే.. ఆల్రెడీ పదవీకాలం ముగిసిన బిటి నాయుడు స్థానంలో ఒకరిని తీసుకోవాలనుకుంటున్నారు. బీసీ నేత యనమల రామకృష్ణుడు సామాజిక వర్గం నుండి ఇప్పటికే శాసన సభ, క్యాబినెట్ చోటు దక్కిన తరుణంలో ఆ స్థానాన్ని మరో బీసీ సామాజికవర్గ నాయకుని కట్టబెట్టే అలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన వారికి కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది.

మరో టీడీపీ నాయకుడు బీసీ సామాజికవర్గానికి చెందిన దువ్వారపు రామారావు పదవి కాలం ముగియనుంది. ఆ సామాజికవర్గానికి ఇప్పటికే శాసన సభలో చోటు దక్కింది. సీట్ల కూర్పులో ఇచ్చిన హామీల్లో మొదటిది బహిరంగ ప్రకటన చేసిన చేసిన తొలి శాసన మండలి స్థానం పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ కి ఇప్పటికే ఖరారు చేసి చంద్రబాబు వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్లు తెలుస్తోంది. డాక్టర్ కొమ్మాలపాటి వివాద రహితుడు. తన నియోజవర్గంతో పాటు పల్నాడు జిల్లాలో జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టి 7 స్థానాలు గెలుపుకు కృషి చేసిన సంగతి అందరికీ తెలుసు.

గత మండలిలో క్షత్రియ సామాజికవర్గం నుండి ఉపాద్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ప్రతినిధిగా ఉండేవారు. ప్రస్తుత మండలిలో కూడా ఆ సామాజికవర్గానికి దక్కనుందని తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నికల హామీలో ప్రకటించిన రెండు ఎమ్మెల్సీలలో రెండవది పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మ కు ఖారారు చేసినట్లు సమాచారం.

మొత్తానికి చంద్రబాబు హామీ ఇచ్చిన డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమే అంటున్నారు.

Tags

Next Story