Bird Flu in Eluru : వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడం అబద్ధం.. ఏలూరు జిల్లా కలెక్టర్

ఇప్పటి వరకు ఇండియాలో మనుషుల కు బర్డ్ ఫ్లూ సోకినట్టు ఆధారాలు లేవని ఏలూరు కలెక్ట ర్ వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు బాదంపూడిలో ఓ వ్యక్తి బర్డ్ ఫ్లూ అంటూ వచ్చిన వార్తపై ఆయన స్పందించారు. సరైన అధికారిక ప్రక టన లేకుండా బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ ఎలా చేస్తారన్నా రు. ఇలాంటి సమయాల్లో మీడియా బాధ్యతాయు తంగా వ్యవహరించాలని కలెక్టర్ హితవు పలికారు. బర్డ్ ఫ్లూ విషయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని, నియంత్రణలో అందరూ సహక రించాలని కోరారు. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫామ్ కు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆ జిల్లా అధికారులు అలెర్టయ్యారు. 10కిలో మీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్లుగా విధించారు. జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ మాలిని మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక్కడ తొలి కేసు నమోదైంది. దీంతో, కేసు నమోదైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. బర్డ్ ఫ్లూ సోకిన వారికి చికిత్స అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని తెలిపారు. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం ఈ వార్తలను ఖండించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com