YS Jagan : జగన్ తప్పుడు నిందలు.. ఇంకా ఎన్నాళ్లు..!

YS Jagan : జగన్ తప్పుడు నిందలు.. ఇంకా ఎన్నాళ్లు..!
X

మాజీ సీఎం, వైసిపి అధినేత జగన్ మొదటి నుంచి తప్పుడు నిందలు వేస్తూనే కాలం గడిపేస్తున్నాడు. ఆయన అధికారంలోకి వచ్చింది కూడా ఇలాంటి నిందలతోనే. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇలాంటి తప్పుడు నిందలు వేస్తూ అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాడు. జగన్ గతంలో 2014లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పింక్ డైమండ్ అనే కట్టు కథ సృష్టించి చంద్రబాబు నాయుడు ఇంట్లోనే ఉంది అంటూ లేనిపోని నిందలు మోపాడు. ఆ తర్వాత ఇంటర్నల్ గ్రేడింగ్ అంటూ ఇంకో నింద మోపాడు. కానీ అవన్నీ ఉత్తవే అని తేలిపోవడంతో తెల్ల మొహం వేశాడు. ఇక తన బాబాయ్ హత్య విషయంలో సాక్షి మీడియాలో ఎలాంటి కథనాలు రాయించాడో అందరికీ తెలిసిందే. అసలు నిజాలను దాచిపెట్టి చంద్రబాబు నాయుడు మీద హత్య ఆరోపణలు చేయాలని చూసి అడ్డంగా దొరికిపోయాడు. జగన్ చేస్తున్న నేరాలను, అవినీతి పనులను చివరకు చంద్రబాబు నాయుడు మీదకు నెట్టేయడమే ప్రధాన పనిగా పెట్టుకున్నాడు.

ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా మారకుండా ఇలాంటి పనులే చేస్తున్నాడు. మొన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఎలాంటి అబద్ధం ఆడాడో చూసాం. వైసిపి హయాంలోనే ఆ ప్రాజెక్టు ఆగిపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆపాడు అంటూ కుట్రలకు తెర తీశాడు. ఇప్పుడు అమరావతి విషయంలో ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ గా తిరుమల దగ్గర ఖాళీ మద్యం సీసా బాటిల్లను వేయించి దాన్ని ప్రస్తుత టిటిడి బోర్డు మీదకు నెట్టేయాలని భూమున కరుణాకర్ రెడ్డి ప్రయత్నించాడు. దీని వెనకాల కూడా జగన్ ఉన్నాడని అనుమానాలు చాలానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఇలాంటి పసలేని నిందలను ఎన్నో వేస్తున్నా సరే పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తున్నాడు.

ప్రజల కోసం ఏదైనా మంచి పని చేసి రాజకీయాలు చేస్తే విలువ ఉంటుంది. అంతేగాని లేని వాటిని క్రియేట్ చేసి ఎంతసేపు తప్పుడు నిందలు మోపాలని చూస్తే ప్రజలు ఛీ కొడుతారు అనే విషయాన్ని జగన్ గమనించాలి. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అరాచకాలు సృష్టిస్తే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు కూడా అలాగే రెచ్చిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని కూటమినేతలు హెచ్చరిస్తున్నారు.

Tags

Next Story