YS Jagan : కోటి సంతకాలు అంటున్న జగన్.. నిజమేనా..?

YS Jagan : కోటి సంతకాలు అంటున్న జగన్.. నిజమేనా..?
X

వైసిపి హయాంలో చేసిన అరాచకాలు అన్ని బయటపడుతూ వైసిపి నేతలు జైల్లోకి వెళ్తున్నారు. దీంతో వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి జగన్ కొత్త నాటకం ఎంచుకున్నారు. మెడికల్ కాలేజీలలో పిపిపి విధానం పెద్ద స్కామ్ అంటూ నానా హంగామా చేస్తున్నారు. కానీ అసలు జగన్ కు పీపీపీ విధానం విధానం అంటే పెద్దగా తెలిసినట్టు లేదు. పిపిపి విధానంలో ప్రభుత్వమే పూర్తి అధికారాలు కలిగి ఉంటుంది. అంతేగాని ప్రైవేట్ వాళ్లకు ఎలాంటి అధికారాలు ఉండవు. గతంలో పార్లమెంటరీ కమిటీ ఈ పీపీపీ విధానం మీద తయారుచేసిన నివేదికపై వైసీపీ ఎంపీ గురుమూర్తి సంతకం కూడా చేశారు. ఆయన జగన్ చెబితేనే చేశారనే విషయం అందరికీ తెలిసిందే. అప్పుడు కరెక్ట్ అని చెప్పిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంటే ఏదో ఒక అశాంతి రాజేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఆయన కోటి సంతకాలు అని చెబుతున్నారు. కానీ ఈ కోటి సంతకాలు ఎక్కడినుంచి సేకరించారు ఎవరి సంతకాలు సేకరించారు అనే విషయాలు మాత్రం బయటకు చెప్పట్లేదు. నిజంగానే కోటి సంతకాలు సేకరిస్తే వాళ్ల ఆధార్ కార్డులు పెట్టగలరా. కనీసం వాళ్ళ వివరాలు అయినా చెప్పగలరా. ఇలాంటివి ఏమీ లేకుండానే కోటి సంతకాలు అనగానే నమ్మేయడానికి ఇదేమైనా ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ కాదు కదా. గతంలో జగన్ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి గెలిచిన చరిత్ర జగన్ కే దక్కింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రచారాలతో గెలవాలని చూస్తున్నాడు. కానీ అలాంటి ప్రచారాలు నమ్మే పరిస్థితి లేదు.

జగన్ తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీను కూడా పూర్తి చేయలేదు. కానీ పీపీపీ విధానం తప్పు అని చెప్పేస్తున్నారు. ఆయన కోటి సంతకాలు అంటూ బిల్డప్ ఇవ్వటమే తప్ప ఎలాంటి బలమైన ఆధారాలు చూపించలేక పోతున్నారు. కోటి సంతకాలు అని చెప్పడం వరకే పరిమితం అయ్యారు తప్ప పీపీపి విధానం తప్పు అని నిరూపించలేకపోతున్నారు.


Tags

Next Story