YS Jagan : పిపిపి విధానంపై చరిత్ర తెలుసుకో జగన్..

మాజీ సీఎం వైఎస్ జగన్ ఏదో ఒక ప్రయత్నం చేసి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడమే టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఓ వైపు వైసిపి హయాంలో జరిగిన వరుస కుంభకోణాలు బయటపడుతుండటతో.. ప్రజల నుంచి ఎలాగైనా దృష్టిని మళ్ళించాలని పసలేని ప్రచారాలు మొదలుపెట్టాడు. అందులో భాగంగా మెడికల్ కాలేజీల్లో పిపిపి విధానంపై రకరకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు మొత్తం ప్రైవేటు పరం అవుతాయని.. ప్రజలకు ఉచిత వైద్యం అందదు అంటూ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టాడు. ఆయన చేస్తున్న ప్రచారాలతో అడ్డంగా దొరికిపోతున్నాడు. ఎందుకంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే కొన్ని జీవోలు ఇచ్చాడు. అందులో ఎన్నారై కోటా, జనరల్ కోటా లాంటివి మెన్షన్ చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన పిపిపి విధానంలో అవేవీ తగ్గించలేదు కదా. వాటిని క్రాస్ చేయకుండానే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈ విధానంలో సీట్లు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కేవలం మెడికల్ కాలేజీల నిర్మాణంలో మాత్రమే ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది. వారికి కొద్దిపాటి లాభాలు మాత్రమే జరుగుతాయి. కానీ మిగతా మొత్తం లాభాలు ప్రభుత్వానికే చెందుతాయి. సర్వాధికారులు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు అది ప్రైవేటుపరం ఎలా అయినట్టు అవుతాయి. ఈ పీపీపీ విధానం చాలా గొప్పది అని గతంలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఒక వీడియోలో చెప్పారు.
కావాలంటే వైసిపి నేతలు ఆ వీడియో చూసి క్లారిటీ తెచ్చుకోవాలి. మరి ఈ విధానాన్ని గొప్పది అని చెప్పిన తన తండ్రిని జగన్ ఇప్పుడు తప్పు పడతాడా. అంటే అస్సలు పట్టడు కదా. పైగా తిరుపతి ఎంపీ గురుమూర్తి పార్లమెంటరీ కమిటీ ఈ పిపీపీ విధానం మీద ఇచ్చిన నివేదికలో సంతకం కూడా పెట్టారు కదా. అంటే జగన్ తనవాళ్లు చేసేది మాత్రం కరెక్ట్ అంటాడు. అదే పనిని కూటమి ప్రభుత్వం చేస్తే మాత్రం తప్పు అంటాడు. ఇక్కడే జగన్ అడ్డంగా దొరికిపోతున్నాడు కదా. కాబట్టి ఈ విధానాన్ని విమర్శించే ముందు తన తండ్రి ఏం మాట్లాడాడో ఒకసారి జగన్ తెలుసుకుంటే మంచిది అంటున్నారు ఏపీ ప్రజలు.
Tags
- Jagan Mohan Reddy
- YSRCP
- Andhra Pradesh politics
- Coalition government
- Chandrababu Naidu
- PPP model
- Medical colleges
- Health sector reforms
- False propaganda
- Public-private partnership
- Free healthcare
- Government control
- YS Rajasekhara Reddy remarks
- Parliamentary committee report
- Gurumurthy MP
- Political double standards
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

