YS Jagan : వైసీపీ సోషల్ వారియర్స్ మీద ఆంక్షలపై జగన్ ఆగ్రహం

APవ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు నిర్బంధించడంపై YCP అధ్యక్షుడు జగన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో తీవ్రంగా ఖండించారు. తక్షణం ఆపకుంటే చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం అంటే వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే అన్నారు. దీనిని రాజ్యాంగంపై ప్రత్యక్షంగా జరుగుతున్న దాడిగానే పరిగణించాలన్నారు.
రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి, కస్టడీలో వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని అభిప్రాయపడ్డారు. . పోలీసుల అధికార దుర్వినియోగం క్షమించరాని నేరం అన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వీటిని తక్షణమే ఆపకుంటే సోషల్ మీడియా కార్యకర్తల హక్కులను పరిరక్షించడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com