YS Jagan : విజయమ్మపై జగన్ కోపం.. సమర్థిస్తున్న వైసీపీ బ్యాచ్..!

YS Jagan : విజయమ్మపై జగన్ కోపం.. సమర్థిస్తున్న వైసీపీ బ్యాచ్..!
X

జగన్ ఎలాంటి అరాచకాలు చేసినా సరే దాన్ని నిస్సిగ్గుగా సమర్థించడానికి వైసీపీ బ్యాచ్ ఎప్పుడూ రెడీగానే ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక మొన్న వైఎస్ విజయమ్మ పుట్టినరోజు నాడు జగన్ కనీసం విషెస్ చెప్పలేదు. ఒక ట్వీట్ చేయడానికి కూడా జగన్ కు ఇష్టం లేకుండా పోయింది. దీంతో జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు సామాన్య జనాలు. ఆస్తి కోసం కన్నతల్లికి కనీసం విషెస్ చెప్పకుండా ఉంటారా అని జగన్ ను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శించడంతో.. వెంటనే వైసీపీ బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. అసలు విజయమ్మ కన్న కొడుకుకే ఆస్తి విషయంలో అన్యాయం చేసిందంటూ కల్లబొల్లి కామెంట్లు, పోస్టులతో రెచ్చిపోయింది వైసీపీ బ్యాచ్. పైగా విజయమ్మ ప్రస్తుతం షర్మిల ట్రాప్ లో పడ్డారని.. అందుకే అలా మాట్లాడుతున్నారంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా చాలా కాలం తర్వాత లక్ష్మీ పార్వతి బయటకొచ్చి జగన్ కు మద్దతివ్వడం మహా దారుణంగా ఉందని అంటున్నారు సామాన్య జనాలు. ఎందుకంటే సొంత తల్లిపై కూడా ఇలాంటి మాటలు, రాతలు ఎవరైనా చేయిస్తారా అంటున్నారు. దీన్ని బట్టి జగన్ తనకు అడ్డు వస్తే ఎవరినైనా ఎలా ఇబ్బంది పెడుతారో అర్థం అవుతోందని చెబుతున్నారు. జగన్ లాంటి రాజకీయాలు ఎవరూ చేయరని.. శత్రువులకు కూడా విషెస్ చెబుతారు అలాంటిది తల్లికి చెప్పకుండా.. పైగా తన బ్యాచ్ తో విజయమ్మపై ఇలా మాట్లాడించడం ఏంటని మండిపడుతున్నారు.

జగన్ లాగా కన్నతల్లిపై రాజకీయాలు చేసే వ్యక్తి ఎవరూ ఉండదరిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అయినా సరే జగన్ కు అవేవీ పట్టవనుకోండి. ఎందుకంటే తన స్వార్థపు రాజకీయాలనే చూసుకుంటాడు తప్ప.. తల్లి, చెల్లి అనే బంధాలు జగన్ కు పెద్దగా నచ్చవనేది ఎప్పుడో అందరికీ అర్థం అయ్యేలా చేశాడని అంటున్నారు సామాన్యులు. జగన్ లాంటి వ్యక్తికి ప్రజలే గట్టి బుద్ధి చెప్పాలని.. కన్నతల్లిపై రాజకీయాలు చేసే వ్యక్తి ప్రజలకు ఏం మేలు చేస్తాడని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు

Tags

Next Story