YS Jagan : జగన్ ఫేక్ ప్రకటనలు.. పట్టించుకోని జనాలు..!

మాజీ సీఎం జగన్ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో రెండు నాల్కల ధోరణి బయటపెడుతూనే ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ వచ్చిన మొదట్లో.. అది దేనికీ పనికిరాదని అన్నారు. ఒక్క ఉద్యోగం రాదని.. అనవసరం అని చెప్పారు. కానీ ఆ తర్వాత తన వల్లే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని మాట మార్చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో కూడా ఇలాంటి ప్రకటనలే చేశారు. దీంతో వైసీపీ నాయకులకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇక రాజధాని అమరావతి విషయంలో అయితే పూటకో రకంగా ఆయన ప్రకటనలు చేయడం అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.
ముందుగా అమరావతి నిండా మునిగిపోతుందని మాట్లాడారు. ఆ తర్వాత ప్రజల నుంచి విమర్శలు రావడంతో తాను అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పించారు. మళ్లీ మొన్న ప్రెస్ మీట్ పెట్టించి మావిగన్ అంటూ ఎక్కడ లేని ప్రకటన ఒకటి చేసేశారు. ఇక దానిపైన ఎన్ని రకాలుగా విమర్శలు వచ్చాయో అందరికీ తెలిసిందే. ఆ ప్రకటన చేసినప్పటి నుంచి జగన్ కనీసం బయటకు కూడా రావట్లేదు.
మళ్లీ బెంగుళూరు ప్యాలెస్ లోకి వెళ్లిపోయారు. ఇలా జగన్ ప్రతిసారి పసలేని ప్రకటనలు చేస్తూ పలుచన అవుతున్నారు. ఆయన ప్రకటనలు చూసిన జనాలు.. ఆయన చెప్పేది కూడా పట్టించుకోవట్లేదు. ఇలాంటి ఫేక్ ప్రకటనలతో జనం మెప్పు పొందలేమనే విషయం జగన్ కు ఇంకా అర్థం కావట్లేదు కాబోలు. కాబట్టి జగన్ రాను రాను జనాల్లో ఇంకా నమ్మకం కోల్పోతూనే ఉన్నారు తప్ప.. ఎలాంటి పట్టు సాధించట్లేదనే విషయం అటు వైసీపీ నాయకులకు కూడా అర్థం అవుతోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
