ఏపీలో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ సర్కార్

ఏపీలో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ సర్కార్
రిజిస్ట్రేషన్‌ శాఖ వరుస బాదుడుతో జనాలపై భారం మోపుతుంది.తాజాగా నిర్మాణాల మార్కెట్‌ విలువ పెంచింది ఏపీ ప్రభుత్వం.

ఏపీలో ప్రజల నడ్డి విరుస్తుంది జగన్ సర్కారు.రిజిస్ట్రేషన్‌ శాఖ వరుస బాదుడుతో జనాలపై భారం మోపుతుంది.తాజాగా నిర్మాణాల మార్కెట్‌ విలువ పెంచింది ఏపీ ప్రభుత్వం. కమర్షియల్‌ కాంప్లెక్స్‌లకు ప్రత్యేకంగా వడ్డింపులు ఉండనున్నాయి.రకరకాల ఫీజులు పెంచి ప్రజలపై మరోసారి ఆర్థిక భారం మోపింది.వరుస బాదుడుకు సిద్ధమైన రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ రెడీ అయి పోయింది. గ్రామీణ, పట్టణాలనే తేడా లేకుండా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచేసింది.

ఇక రిజిస్ట్రేషన్‌,స్టాంపుల శాఖ ఉమ్మడిగా ఉన్న స్ట్రక్చరల్‌ నుంచి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ పేరుతో కొత్త కేటగిరీని సృష్టించింది సర్కార్‌. దీంతో వెయ్యి చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపంలో గతంలో కంటే 15 వేల వరకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్‌ విలువను పెంచడంతో ఈ భారం పెరిగింది.వైసీపీ అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖ ఇప్పటివరకు ఆరుసార్లు ప్రజలపై భారాన్ని మోపింది.

మరోవైపు కొత్త జిల్లా కేంద్రాలు,చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువతో పాటు నేషనల్‌ హై వే లు, రహదారులు,దుకాణాలు, ఇండ్రస్ట్రీలు ఇతర అంశాల ప్రతిపాదికగా 13శాతం నుంచి 75శాతం వరకు పెంచారు.గత ఏప్రిల్‌ నుంచి మరోసారి యూజర్‌ ఛార్జీలు పెరిగాయి.మళ్లీ జూన్‌ ఒకటి నుంచి ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల విలువలను సవరించి, పెంచేశారు. దీంతోపాటు స్ట్రక్చర్‌ మార్కెట్‌ విలువలను రాష్ట్రవ్యాప్తంగా పెంచేశారు.సినిమా హాళ్లు,మిల్లులు,కర్మాగారాలు,కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా భారం వడ్డించారు. అంతేకాదు పూరిళ్లు పైనా చదరపు అడుగుకు అదనంగా 10 రూపాయల చొప్పున బాదేశారు.

ఇక కార్పొరేషన్‌ పరిధిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ పరిధిలోనైతే చదరపు అడుగుకు ప్రస్తుతం పన్నెండు వందలు వసూలు చేస్తున్నారు. దీనిని పద్నాలుగు వందలు చేశారు.పట్టణ పంచాయతీ పరిధిలో 1,060 నుంచి పన్నెండు వందలకు పెంచారు,గ్రామీణ ప్రాంతాల్లో 770 నుంచి 850కు ప్రభుత్వం పెంచింది. మరోవైపు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ల శాఖ పన్నులు అంతటా ఒకేలా పెరుగుతూ ఉండేవి. అయితే జగన్‌ సర్కార్‌ ఈసారి కమర్షియల్‌ ప్రాంతాల వారీగా ప్రత్యేక భారాన్ని మోపింది. ఆర్‌సీసీ నిర్మాణాలు పది అడుగుల ఎత్తుకుపైగా ఉండే మల్టీప్లెక్స్‌, షాపింగ్‌ మాల్స్‌ నిర్మాణాల్లో చదరపు అడుగుకు పదిహేను వందలు చొప్పున వసూలు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story