JAGAN: జగన్ అడ్డాలో ఉప ఎన్నిక రణం

పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు... అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 12న ఎన్నిక జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కావడంతో.. ఈ ఉప ఎన్నికలపై రాష్ట్రమంతటా ఆసక్తి నెలకొంది. పులివెందుల ఉప ఎన్నిక తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈసారి ఈ ఎన్నిక వైఎస్ కుటుంబానికి ఏకపక్షం కాదన్న అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నువ్వా, నేనా అంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇప్పటికే పులివెందుల ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ స్వశక్తులు ఒడ్డుతున్నాయి.
ప్రచారానికి తెర
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి తెర పడింది. దీంతో పులివెందులలో ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా అన్ని కేంద్రాలు సమస్యాత్మకమే.. ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 4 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో పులివెందులలో 550 మంది పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక కోసం 650 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందులలో 550 మంది పైన బైండోవర్ కేసులు నమోదు అయ్యాయి.
ఓటుకు రూ.10వేలు
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైసీపీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఓటు కోసం ఎంత డబ్బైనా ఇచ్చేందుకు పార్టీలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక్కో ఓటు కోసం ఏకంగా 10 వేల రూపాయలు పైనే ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. ఎంత ఖర్చు చేసైనా సరే పులివెందుల స్థానాన్ని గెలవాలన్న కసిలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే. ఇప్పుడు రెండు కాకపోయినా.. సొంతగడ్డ పులివెందులైనా గెలిచి తీరాలని వైఎస్ జగన్ భావిస్తున్నారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోట
పులివెందుల నియోజకవర్గ మంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట అని చెబు తుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 1978లో రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబాన్ని పులివెందుల నియోజకవర్గం ఆదరిస్తూ వస్తోంది. ఇక్కడ ప్రతి ఎన్నికా హింసాత్మకం గా సాగుతోందనే విషయం చరిత్ర చూస్తే తెలు స్తుంది. 1983లో టీడీపీ ఆవి ర్భవించిన తరువాత ఆ పార్టీకి కూడా నియోజక వర్గంలో చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. దివంగత వైఎస్, జగన్ సునామీలో కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు అలాగే కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మళ్లీ పులివెందులపై రాజకీయ చర్చ నడుస్తోంది.
రేపే పోలింగ్
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థా నాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్నాయి. పులివెందులలో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి, వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. వైఎస్ కుటుంబం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలన్నా కత్తిమీద సాముగా ఉన్నట్లు చెబుతారు. జగన్ హయాంలో నామినేషన్లు వేసే సమయంలోనే రణరంగంగా మారింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అందరూ స్వేచ్ఛగా నామినేషన్లు వేశారు. 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెం దుల జడ్పీటీసీకి ఆరు గ్రామ పంచాయతీల పరిధి లో 10,400 ఓట్లు ఉన్నాయి. వైసీపీలో బలమైన నేతలందరూ వరుసగా టీడీపీ గూటికి చేరు తున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 2,166 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి 5,955 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం ఉప ఎన్నికల నేపథ్యం లో పలువురు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం, అధికారపార్టీ కావడంతో టీడీపీ బలపడుతూ వస్తోంది. దీంతో ఈ ఎన్నిక ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టీడీపీ, వైసీపీ దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com