JAGAN: జగన్ కూడా\ రోజా కొడుకేనా..?

మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణిపై తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఆడదో.. మగదో కూడా తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రజలే చెప్పాలని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పకపోతే రప్పా రప్పాగాళ్లు రోడ్లెక్కి మాట్లాడుతున్నాని విమర్శించారు. ఎమ్మెల్యే నా కొడుకులు అని రోజా అంటున్నారని.. అసలు అది ఆడదో.. మగదో తెలియదని బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కూడా రోజా కొడుకేనా అని ప్రశ్నించారు. జగన్ కూడా ఎమ్మెల్యేనే కదా అని అన్నారు. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా.. ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా అని తెలిపారు. ఆయన వయసెంతా.. ఈమె వయసెంతా.. నా వయసెంతా.. ఆమె వయసెంతా అని ప్రశ్నించారు.
జగన్ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడని.. గనులు దోచుకున్నాడు.. ఇసుక దోచుకున్నాడు.. అడవిని దోచుకున్నాడని తెలిపారు. కూటమి నేతలపైనా బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉండాలని ఆయన అన్నారు. అసలు జనసేన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసా అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి పనికిమాలినోళ్లంతా బయటకొచ్చి.. దమ్ముంటే అరెస్టు చేసుకోమని అంటున్నారని విమర్శించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com