JAGAN: జగన్ బంధువు అర్జున్‌రెడ్డి అరెస్ట్

వైసీపీ అధినేత జగన్ బంధువు అర్జున్ రెడ్డిని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ వారి కుటుంబసభ్యుల ఫొటోలు అసభ్యంగా మార్పింగ్ చేయటంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో విచారణకు హాజరైన అర్జున్ రెడ్డిని పీఎస్‌లో అరెస్ట్ చేశారు. అర్జున్‌రెడ్డి.. జగన్‌కు బాబాయ్ వరసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనవడు. గతంలో అర్జున్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా విదేశాలకు పరారయ్యారు. దీంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 8వ తేదీన విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ పోలీసులు అర్జున్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని 41 ఏ నోటీసులు ఇచ్చారు. ఉమ్మడి కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ అతడిపై కేసులు నమోదయ్యాయి. దీంతో జగన్ కు మరో షాక్ తగిలినట్లు అయింది.
కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నందున అతడిని గుడివాడ వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినోద్ నుంచి రూ.50వేల నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వైకాపా అధికారంలో ఉండగా అడ్డూ అదుపు లేకుండా జూద శిబిరాలు నిర్వహించినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఆ శిబిరాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు వినోద్‌పై కేసు నమోదు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

