JAGAN: జమిలీ ఆశలతో జనంలోకి జగన్

JAGAN: జమిలీ ఆశలతో జనంలోకి జగన్
X
కచ్చితంగా జమిలీ వస్తుందని వైసీపీ ధీమా... అందుకే పాదయాత్ర ప్రకటన చేసిన జగన్..! 2027లో జమిలీ వస్తుందన్న నమ్మకంతో వైసీపీ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో జరి­గిన శా­స­న­సభ ఎన్ని­క­ల్లో వై­సీ­పీ ఘో­రం­గా ఓడి­పో­యిం­ది. ఆ తర్వాత చా­లా­మం­ది కీలక నే­త­లు వై­సీ­పీ­ని వీ­డా­రు. జగన్ కూడా పా­ర్టీ పను­ల­ను కా­స్త పక్కన పె­ట్ట­డం­తో వై­సీ­పీ పనై­పో­యిం­ద­ని చా­లా­మం­ది భా­విం­చా­రు. గత అసెం­బ్లీ ఎన్ని­క­ల్లో కే­వ­లం 11 అసెం­బ్లీ సీ­ట్ల­కు పరి­మి­త­మైన వై­సీ­పీ...ఈ సారి వచ్చే ఎన్ని­క­ల్లో ఎలాం­టి అవ­కా­శం ఇవ్వ­కూ­డ­ద­ని ఫి­క్స్ అయిం­ద­ని టాక్ వి­ని­పి­స్తోం­ది. అంత ఓట­మి­లో కూడా… 40 శాతం వరకూ ఓట్లు పడ్డ వి­ష­యా­న్ని గు­ర్తుం­చు­కో­వా­ల­ని, ఆ ఓట్‌ బ్యాం­క్‌­ని కా­పా­డు­కుం­టూ…. సహ­జం­గా వచ్చే ప్ర­భు­త్వ వ్య­తి­రే­క­త­ను క్యా­ష్‌ చే­సు­కో­గ­లి­గి­తే…. మళ్ళీ పవ­ర్‌­లో­కి రా­వ­డం ఖా­య­మ­ని లె­క్క­లే­సు­కుం­టోం­దట పా­ర్టీ అధి­ష్టా­నం. అదే సమ­యం­లో… జమి­లి ఎన్ని­కల గు­రిం­చి కూడా వై­సీ­పీ­లో సీ­రి­య­స్‌­గా చర్చ జరు­గు­తు­న్న­ట్టు సమా­చా­రం. ఖచ్చి­తం­గా జమి­లి వస్తుం­ద­న్న నమ్మ­కం­తో కా­ర్య­క్ర­మా­ల­ను డి­జై­న్‌ చే­య­బో­తు­న్న­ట్టు తె­లు­స్తోం­ది. దాం­తో సం­బం­ధం ఉందా లేదా అన్న సం­గ­తి పక్క­న­బె­డి­తే… పా­ర్టీ అధ్య­క్షు­డు జగ­న్‌ ఇటీ­వల యా­క్టి­వి­టీ బాగా పెం­చా­రు. కూ­ట­మి ప్ర­భు­త్వ వై­ఫ­ల్యా­ల­ను ప్ర­జ­ల్లో­కి తీ­సు­కు వె­ళ్లేం­దు­కు ఆం­దో­ళ­న­లు ని­ర్వ­హి­స్తోం­ది పా­ర్టీ. మి­ర్చి, పొ­గా­కు రై­తుల కోసం గుం­టూ­రు, పొ­ది­లి పర్య­ట­న­లు, వి­విధ సం­ద­ర్భా­ల్లో అరె­స్ట్‌ అయిన వా­రి­కి పరా­మ­ర్శ­ల్లాం­టి­వ­న్నీ ఇం­దు­లో భా­గ­మే­నం­టు­న్నా­రు.

ఆశగా వైసీపీ..

ఏపీ­లో ప్ర­స్తు­తం మూడు ప్రాం­తీయ పా­ర్టీ­లు ఉన్నా­యి. వా­టి­ల్లో టీ­డీ­పీ, జన­సేన కలి­సి ప్ర­భు­త్వా­న్ని ఏర్పా­టు చే­శా­యి. కూ­ట­మి­లో బీ­జే­పీ ఉన్నా.. ఓట్లు, సీ­ట్లు మా­త్రం ఈ రెం­డు పా­ర్టీల కంటే తక్కు­వే. మరో­వై­పు వై­సీ­పీ ఉంది. వై­సీ­పీ సిం­గి­ల్‌ పోటీ చేసి 2019లో ఘన­వి­జ­యం సా­ధిం­చిం­ది. 2024లో మా­త్రం ఊహిం­చ­ని స్థా­యి­లో పరా­జ­యం పా­లైం­ది. ఓటమి తర్వాత కొ­న్ని­రో­జు­లు కా­మ్‌­గా ఉన్న వై­సీ­పీ నే­త­లు.. ఇటీ­వల యా­క్టి­వ్ అయ్యా­రు. జమి­లి ప్ర­క­ట­న­ల­పై ఆశగా ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. ఆ మధ్య జగన్ జమి­లి ఎన్ని­క­ల­పై­నా కీలక వ్యా­ఖ్య­లు చే­శా­రు. అధి­కా­రు­లు, ప్ర­భు­త్వ తీ­రు­పై వి­మ­ర్శ­లు చే­స్తు­న్న సమ­యం­లో జమి­లి ఎన్ని­కల గు­రిం­చి ప్ర­స్తా­విం­చా­రు. జమి­లి ఎన్ని­క­లు జరి­గి­తే.. వై­సీ­పీ­కే లాభం అని జగన్ భా­వి­స్తు­న్న­ట్టు తె­లు­స్తోం­ది. ఇటీ­వల అన్ని జి­ల్లా పా­ర్టీ అధ్య­క్షు­లు, అను­బంధ సం­ఘాల నే­త­ల­తో వై­ఎ­స్‌ జగన్ సమా­వే­శం అయ్యా­రు.

Tags

Next Story