డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే జగన్ శ్రీవారిని దర్శించుకోవాలి : టీడీపీ నేతలు

సీఎం జగన్..తిరుమల పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే సీఎం జగన్ శ్రీవారిని దర్శించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ముందస్తు జాగ్రత్తగా టీడీపీ నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. చిత్తూరు టీడీపీ అధ్యక్షుడు పులివర్తినానిని హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిలను గృహనిర్భంధం చేశారు. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాన్ని ఖండిస్తున్నారు.
Next Story