YS Jagan : నేడు కోర్టుకు జగన్.. ఇక వారం వారం తప్పదా..?

సుమారు ఆరేళ్లకు పైగా సీబీఐ కోర్టు హాజరు నుంచి దూరంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ కోర్టు ముందుకు వస్తున్నారు. ఈ అంశం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. వివిధ కారణాలు, అధికారిక పనులు, భద్రతా అంశాలు వంటి కారణాలను చూపిస్తూ గత కొన్నేళ్లుగా హాజరు నుంచి మినహాయింపులు పొందుతూ వచ్చారు జగన్. ఇప్పుడు కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం అంటే జగన్ కు చెంపపెట్టు అని అంటున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోర్టు హాజరుకు మినహాయింపులు అనేక సందర్భాల్లో పొడిగించబడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలు తరచూ ప్రశ్నలు లేవనెత్తుతూ విమర్శించాయి.
“అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నార”ని విమర్శించేవి. కేసుల వేగం తగ్గిందని న్యాయ వర్గాల్లో కూడా చర్చ సాగింది. ఈరోజు జగన్ కోర్టు ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావడంతో జగన్ కు మళ్లీ వరుస షాకులు తగిలేలా కనిపిస్తున్నాయి.కోర్టు ఇకపై హాజరు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. వారం వారం కోర్టు హాజరు కావాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియమిత వ్యవధిలో కచ్చితంగా హాజరు కావాలని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో లభించిన సడలింపులు ప్రస్తుతం అదే విధంగా కొనసాగుతాయా లేదా అనేది వైసీపీలో చర్చ. ఇన్ని రోజులు అధికార బాధ్యతలను చూపిస్తూ మినహాయింపులు పొందిన జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టు హాజరు తప్పనిసరి కానున్నట్లు కనిపిస్తోంది. విచారణ వేగం పెరిగే సూచనలు కనబడుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

