YS Jagan : జగన్ కుట్రలు చేసినా.. ఆగని పెట్టుబడులు..!

YS Jagan : జగన్ కుట్రలు చేసినా.. ఆగని పెట్టుబడులు..!
X

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేసేస్తున్నారు. అయినా సరే కూటమి ప్రభుత్వ పట్టుదల ముందు జగన్ కుట్రలు పనిచేయట్లేదు. వైసీపీ హయాంలో ఎన్ని కుట్రలు చేయాలో.. ఏపీని ఎంత విధ్వంసం చేయాలో అంతా చేసేశారు. చెప్పుకోడానికి ఏమీ మిగల్చకుండా ఏపీని వందేళ్లు వెనక్కి నెట్టేశారు. ప్రజల బతుకులను ఆగం చేసిన చరిత్ర జగన్ కే దక్కింది. కానీ ఇప్పుడు కూటమి మాత్రం ప్రపంచ స్థాయి కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి దేశమే ఆశ్చర్యపోయేలా చేస్తోంది. గతేడాది దేశంలోనే అత్యధికంగా ఏపీకే పెట్టుబడులు వరదలా వచ్చి చేరాయి. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​, మంత్రి నారా లోకేష్​ కలిసి చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.

అందులో భాగంగానే ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్, క్వాంటమ్ కంప్యూటర్స్, టీసీఎస్, అదానీ డేటా సెంటర్ లాంటివి వచ్చేశాయి. నేడు దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ కూడా ప్రారంభం అయింది. దీంతో వైసీపీ బ్యాచ్ కు నిద్ర పట్టట్లేదంట. ఎందుకంటే వారు ఎన్ని కుట్రలు చేస్తున్నా సరే ప్రపంచ స్థాయి పెట్టుబులు వచ్చేస్తున్నాయి. ఏపీ అత్యద్భుతంగా డెవలప్ అవుతోంది. చంద్రబాబు పాలన అంటే ఏంటో ప్రజలు మరోసారి చూస్తున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకాలు వచ్చినా ఆగట్లేదు.

గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు పది రకాల మాటలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయారు మాజీ సీఎం జగన్. మరి ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు మీద ఎలాంటి మాటలు మాట్లాడుతారో అని అంతా ఎదురు చూస్తున్నారు. అసలే జగన్ క్రెడిట్ కొట్టేయడానికి ఈ మధ్య తెగ ట్రై చేస్తున్నాడు. మరి దీని క్రెడిట్ కూడా కొట్టేస్తాడా లేదంటే సైలెంట్ గా ఉండిపోతాడా అనేది చూడాలి.

Tags

Next Story