YS Jagan : ప్రాణాలు తీస్తున్న జగన్ పరామర్శలు..

YS Jagan : ప్రాణాలు తీస్తున్న జగన్ పరామర్శలు..
X

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో ప్రాణాలు తీస్తున్నారు. ఎవరైనా పరామర్శ చేయడానికి వెళ్ళినప్పుడు సాదాసీదాగా వెళ్తారు. ఎవరికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో కొంత బాధలో ఉన్నవారినే కదా పరామర్శ చేసేది. కానీ జగన్ మాత్రం పరామర్శ యాత్రలకు బదులు.. బిల్డప్ యాత్రలు చేస్తున్నారు. ప్లాన్ ప్రకారమే వైసీపీ బ్యాచ్ తో.. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇండ్ల మీద దాడులు చేయించారు జగన్. ఇప్పుడు సింపతీ కోసం వాళ్ళిద్దరినీ పరామర్శించేందుకు వెళ్లారు. అయితే అది పరామర్శ యాత్రలా కాకుండా బిల్డప్ యాత్రగా ఉంది. జగన్ భారీ ఎత్తున డబ్బులు కురిపించి వేల మందిని రప్పించుకున్నారు. కేవలం గంట సమయంలో వెళ్లే దూరాన్ని కూడా.. దాదాపు 7 గంటల వరకు బిల్డప్ యాత్ర నిర్వహించారు. జగన్ బిల్డప్ ల వల్ల రెండు నిండు ప్రాణాలు పోయాయి.

జోగి రమేష్ ను పరామర్శించడానికి జగన్ ఎంత పెద్ద యాత్ర చేశారో చూశాం. అందులో గంటలకొద్దీ రోడ్లపై జనాలను నిలబెట్టి.. అదంతా తనకు ప్రజాదరణ అన్నట్టు చూపించుకోవాలని ప్రయత్నం చేశారు జగన్. దీంతో వైసిపి కార్యకర్తల్లో ఒకరైన రాంబాబు స్పృహతప్పి పడిపోయారు. ఆయనను వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గంటల పాటు ఒకే చోట నిలబడటం వల్ల ఇలా జరిగినట్టు డాక్టర్లు తెలిపారు. అదే యాత్రలో జగన్ కోసం ఎదురుచూస్తూ బైక్ స్టంట్ చేసిన భార్గవ్ అనే యువ కార్యకర్త కూడా ప్రాణాలు కోల్పోయాడు. బైక్ స్టంట్ చేస్తూ రోడ్డుపై ఉన్న భారీ కేడ్ ను ఢీ కొట్టి బలమైన గాయాలు కావడంతో చనిపోయాడు. ఇలా ఇద్దరు కార్యకర్తలు జగన్ బిల్డప్ యాత్రలో ప్రాణాలు కోల్పోయారు.

గతంలో సత్తెనపల్లిలో పరామర్శ యాత్ర కోసం జగన్ పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించడం వల్ల.. సింగయ్య అనే కార్యకర్త జగన్ కారు కిందే పడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇలా జగన్ పరామర్శల యాత్రల పేరుతో చేస్తున్న.. హంగామా, హడావిడి వల్ల సామాన్య కార్యకర్తల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. పోలీసులు ఎంత చెప్పినా సరే జగన్ వినకుండా.. ఇలా పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి వాళ్ల ఇంట్లో విషాదలు నింపుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వం తన యాత్రకు సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరిగింది అంటూ బురదజల్లే కార్యక్రమాలను ఎత్తుకుంటున్నారు జగన్.

Tags

Next Story