YS Jagan : అంబటి, జోగి తీరు తప్పు కాదా జగన్..?

YS Jagan : అంబటి, జోగి తీరు తప్పు కాదా జగన్..?
X

మాజీ సీఎం జగన్ తీరు ఎలా ఉందంటే.. తప్పు చేసిన వైసీపీ నేతలను ఏమీ అనొద్దంట. వైసీపీ లీడర్లు ఎన్ని బూతులు మాట్లాడినా సరే ఎలాంటి తప్పు బట్టకుండా పైగా వారినే ఎవనకేసుకొస్తున్నాడు జగన్. మొదటి నుంచి జగన్ తీరు ఇదే మరి. ఎంతసేపు సీఎం చంద్రబాబును తిడితే అదే తనకు ఆనందంగా భావిస్తుంటారు జగన్. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని రకాలుగా తిట్టి అవమానించారో చూశాం. కానీ ఏనాడూ సీఎం చంద్రబాబు నోరు జారలేదు. చాలా గౌరవ ప్రదంగానే వ్యవహరిస్తూ వచ్చారు. తన కంటే వయసులో చిన్నవారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నా సరే ప్రజల కోసం మౌనంగా భరించారు. చివరకు అదే ప్రజలు చంద్రబాబుకు మరోసారి అధికారం ఇచ్చారు.

ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీ నేతల తీరు అస్సలు మారట్లేదు. మొన్న అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై ఎలాంటి బూతులు మాట్లాడాడో చూశాం. ఆ తర్వాత నారా లోకేష్ మీద మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా అలాంటి దారుణమైన భాషనే మాట్లాడారు. సీఎం చంద్రబాబు గానీ, మంత్రి లోకేష్ గానీ వారి బూతులపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ వారిని అభిమానించే వారు కూడా పెద్ద ఎత్తున ఉంటారు కదా.

తమ అభిమాన నాయకులను ఇలా బూతులు తిడితే ఎన్ని సార్లు ఊరుకుంటారు. అందుకే నిరసన వ్యక్తం చేయాలి అనుకున్నారు. అలా చేయొద్దని జగన్ అంటున్నారు. ఇక్కడ బూతులు మాట్లాడిన వైసీపీ నేతల తీరు జగన్ దృష్టిలో తప్పు కాదు. అలా బూతులు మాట్లాడటం కరెక్ట్ కాదని జగన్ ఒక్క మాట కూడా అనలేదు. కానీ టీడీపీ నేతలు ఆందోళన తెలిపితే మాత్రం తప్పు అంటున్నారు. దాన్ని బట్టి జగన్ తీరు ఏంటో అందరికీ అర్థం అవుతోందని కూటమి నేతలు అంటున్నారు.

Tags

Next Story