YS Jagan : హిందువులపై జగన్ కుట్రలు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..

YS Jagan : హిందువులపై జగన్ కుట్రలు.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
X

వైసిపి అధినేత జగన్ ఎప్పటికప్పుడు హిందువులపై తన అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు. చివరకు హిందూ దేవుళ్లను కూడా కించపరిచేలా ఆయన వ్యవహారాలు ఉంటున్నాయి. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా తిరుమల లడ్డూనే కల్తీ చేసిన మహా పాపం మూటగట్టుకున్నారు జగన్. పరకామణి చోరీ, లడ్డు కల్తీ, చివరకు శాలువాలను కూడా కల్తీ చేసిన చరిత్ర వైసిపి నేతలకు దక్కింది. ఇక జగన్ ఎప్పటికప్పుడు హిందువుల మధ్య చీలిక తీసుకురావడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారో అందరికి తెలిసిందే. హిందువుల మధ్య కులాల కుంపట్లు పెట్టడం జగన్ కు మొదటి నుంచి అలవాటు. హిందూ కులాలను రెచ్చగొట్టడం ఏపీలో అశాంతి నెలకొల్పేలా ప్రయత్నించడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. కాపు, కమ్మ సామాజిక వర్గానికి ఏమాత్రం సందు దొరికినా సరే చిచ్చు రాజేయాలని చూసే వ్యక్తి జగన్.

ఆ మధ్య గుంటూరులో ఇద్దరు మధ్య గొడవ జరిగి ఒకరు చనిపోతే.. కాపు కుల మీద టిడిపి దాడి అంటూ తప్పుడు ప్రచారం చేశారు వైసీపీ నేతలు. ఆ తర్వాత రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా సరే దాన్ని కులాలకు అంటగట్టి పార్టీల మధ్య చీలిక తెచ్చేలా ఎన్ని ప్రయత్నాలు చేశారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ విచారణలో లడ్డు కల్తీ జరిగిందని తేలడంతో కొత్త కుట్రలకు తరలిస్తున్నారు వైసిపి నేతలు. అందులో భాగంగానే అంబటి రాంబాబు ఇంటి మీద వైసిపి బ్యాచ్ దాడి చేసి దాన్ని టిడిపి మీదికి నెట్టేయడం చూశాం. ఆ తర్వాత జోగి రమేష్ ఇంటికి లిప్ పెట్టిన వైసీపీ నేతలు దాన్ని కూటమి మీద నిందలు వేయడం చూస్తూనే ఉన్నాం.

వైసిపి నేతల కుంభకోణాలు దాచిపెట్టడానికి.. ప్రజల దృష్టిని మళ్లించడానికి.. కూటమి మధ్య చీలిక తీసుకురావడమే లక్ష్యంగా ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసిపికి అలవాటు అయిపోయింది. హిందూ కులాల మధ్య గొడవలు పెట్టడం.. హిందూ ఆలయాల మీద దాడులు, చివరకు కలియుగ దైవం సన్నిధిలో కుంభకోణాలు, లడ్డు కల్తీ లాంటివి చూసినప్పుడల్లా జగన్ ఎలాంటి కుట్రలకు ప్లాన్ చేస్తున్నారు అనేది అందరూ అర్థం చేసుకుంటున్నారు. అందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా సరే జగన్ వ్యవహారంలో మార్పు రావట్లేదు.

Tags

Next Story