YS Jagan : జగన్ సింపతీ రాజకీయాలు.. గతం మర్చిపోయారా..

YS Jagan : జగన్ సింపతీ రాజకీయాలు.. గతం మర్చిపోయారా..
X

మాజీ సీఎం జగన్ తాను ఏం చేసినా కరెక్టే అనుకుంటారు. అవతలి వారు ఏదైనా చేస్తే దానిపై రచ్చ చేయడానికి రెడీగా ఉంటారు. ఇక అదును చూసి సింపతీని పొందడానికి ఆయన చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. నిన్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కాంగ్రెస్ యూత్ లీడర్లు అర్థనగ్న ప్రదర్శన చేయడంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని వాడుకోడానికి జగన్ రెడీ అయిపోయారు. కాంగ్రెస్ చేసింది తప్పు అని.. దేశం పరువు తీశారంటూ ట్వీట్ వేశారు. ముందు దేశ ప్రయోజనాలు ముఖ్యమని.. ఆ తర్వాతే రాజకీయాలు అన్నారు. అయితే జగన్ గతంలో చేసినవి ఇక్కడ చర్చకు వస్తున్నాయి. ఎందుకంటే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎన్నో అధికారిక కార్యక్రమాలకు అడ్డు పడడ్ఆరు. అమరావతికి సింగపూర్ ప్రతినిధులు వచ్చినప్పుడు జగన్ ఏం చేశారో బహుషా మర్చిపోయినట్టున్నారు.

గతంలో సీఎం చంద్రబాబు అమరావతి డెవలప్ మెంట్ కోసం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని నిర్వీర్యం చేయడానికి జగన్ ఎన్ని కుట్రలు చేశారో అందరికీ తెలుసు. ఏకంగా గవర్నమెంట్ కు ఫండ్స్ ఇవ్వొద్దంటూ గతేడాది కూడా లేఖలు రాశారు. ఎన్నో కార్యక్రమాలను అడ్డుకున్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించారు. ఇలాంటి ఎన్నో చెప్పుకోలేని దారుణాలను చేసిన జగన్ కూడా.. చివరకు విలువల గురించి మాట్లాడుతున్నారా అంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు.

తాము ఇక్కడ కాంగ్రెస్ చేసింది సమర్థించట్లేదని.. కానీ జగన్ అదును చూసి సింపతీ రాజకీయాలు చేయడం ఏంటని మండిపడుతున్నారు కూటమి నేతలు. గతంలో జగన్ ఎన్నో దారుణాలు చేస్తే.. వాటి గురించి కనీసం పశ్చాత్తాపం లేదు కానీ ఇప్పుడు నీతులు చెప్పడానికి రెడీ అయిపోతున్నారు. నీతులు చెప్పాలంటే ముందు పాటించి చూపించాలి అనే విషయం బహుషా జగన్ కు ఇంకా తెలియనట్టుంది. అందుకే ఆయన ఎన్ని నీతులు చెప్పినా జనాలు కనీసం రెస్పాండ్ కావట్లేదు.

Tags

Next Story