YS Jagan : శాసనమండలిపై జగన్ రెండు నాల్కల ధోరణి..

YS Jagan : శాసనమండలిపై జగన్ రెండు నాల్కల ధోరణి..
X

మాజీ సీఎం జగన్ తనకు ఏది అసవరం ఉంటే దానికి అనుకూలంగా మాట్లాడుతుంటారు. అంతే తప్ప ఒక మాటపై, ఒక సిద్ధాంతంపై అస్సలు ఉండరు. ఇది ఆయనకు మొదటి నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు శాసనసభకు జగన్ రావట్లేదు తన ఎమ్మెల్యేలను కూడా రానివ్వట్లేదు. కానీ శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీలను పంపుతున్నారు. ఇక్కడ జగన్ రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ అమరావతికి అన్యాయం చేయడానికి ఓ బిల్లును తీసుకురావాలని చూశారు. ఆ బిల్లును శాసనమండలి అడ్డుకుంటే.. అప్పుడు శాసనమండలిని రద్దు చేయడానికి జగన నానా రకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. ఒకప్పుడు ఖర్చు దండగ అని ఏ శాసనమండలిని అవమానించారో.. ఇప్పుడు అదే శాసనమండలిలో తన వాదనలు వినిపించాలని జగన్ ఎమ్మెల్సీలను పంపుతున్నారు.

ఇది ఎంత దారుణం అసలు. ఒకప్పుడు సీఎంగా ఉండి చట్ట సభలనే రద్దు చేస్తామన్న రేంజ్ లో మాట్లాడారు జగన్. ఇప్పుడు అసెంబ్లీలో సంఖ్యా బలం లేదు కాబట్టి.. శాసనమండలికి తన మనుషులను పంపుతున్నారు. శాసనమండలిలో వైసీపీకి సంఖ్యాబలం ఉంది. అందుకే అక్కడకు పంపుతున్నారు. మరి సీఎంగా ఉన్నప్పుడు కూడా శాసనమండలిని గౌరవించి ఉంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా దానికి ఒక అర్థం ఉండేది. కానీ అప్పుడు అధికారం ఉందనే అహంకారంతో ఎన్నో మాటలు మాట్లాడారు.

ఇప్పుడు మాత్రం అదే శాసనమండలిలో తిరుమల కల్తీ నెయ్యి కేసుపై ఎమ్మెల్సీలతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. నిరసనలు తెలపాలని ఆదేశిస్తున్నారు. రకరకాల తప్పుడు వాదనలు తన ఎమ్మెల్సీలతో వినిపిస్తున్నారు. శాసనమండలి అవసరమే లేదన్న జగన్ కు.. ఇప్పుడు అదే శాసనమండలి మీద ఇంత ప్రేమ ఏంటా అని మండిపడుతున్నారు నెటిజన్లు.

Tags

Next Story