YS Jagan : ఎన్నిసార్లు మాట మారుస్తావు జగన్..!

మాజీ సీఎం జగన్ అమరావతి విషయంలో ఎప్పటికప్పుడు మాట మారుస్తూనే ఉన్నాడు. ప్రజలు ఛీ కొడితే అప్పుడు అమరావతికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పటికప్పుడు అమరావతి మీద తన అసలు రూపాన్ని బయటపెడుతూనే ఉన్నాడు. నిన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి నదీగర్భంలో కడుతున్నారని.. నిండా మునిగిపోతుందని.. సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అంటూ రకరకాల మాటలు మాట్లాడారు. అమరావతి రాజధాని అనే మాటే లేదని.. దానికి చట్టబద్ధత లేదని.. అసలు పూర్తి కాదని ఏవేవో మాట్లాడాడు. ఒక రకంగా అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెట్టుబడులు, కూటమి ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక.. మళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టాడు. కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ రావద్దని, ప్రజలకు మంచి జరగదని ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నాడు మాజీ సీఎం జగన్.
2019కి ముందు వరకు అమరావతికి జై కొట్టాడు. అమరావతి కట్టడం మంచిదే అన్నాడు. కానీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతి ప్రజలను ఆగం చేశాడు. అమరావతి రైతులను నానా ఇబ్బందులు పెట్టాడు. చివరకు ఏపీకి రాజధాని లేకుండా ఐదేళ్లు పరిపాలించాడు. తన హయాంలో అమరావతిలో పనులు ఎక్కడికక్కడ ఆపేసి.. ఏపీను రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చాడు. ఆ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ధారణంగా ఓడిస్తే.. మొన్న అమరావతి రాజధానిగా ఉండటం జగన్ కు, వైసిపి పార్టీకి అభ్యంతరం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించాడు. కానీ ఇంతలోనే జగన్ మళ్ళీ మాట మార్చాడు.
అమరావతి నగరం మీద తన అసలు రూపం ఇదే అంటూ బయట పెట్టుకున్నాడు. జగన్ ఇలా పూటకో మాట మాట్లాడిన అమరావతి విషయంలో ప్రతిసారి వ్యతిరేకంగానే ఉంటున్నాడు. అంటే జగన్ కు ఏపీకి రాజధాని ఉండటం నిజంగా ఇష్టం లేదనిపిస్తోంది. ప్రజలు తిడుతున్నా సరే అమరావతి మీద ఇంత కక్ష ఎందుకు కడుతున్నాడో అర్థం కావట్లేదు అని కూటమి నేతలు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెడుతున్న టైం లో జగన్ ఓర్వలేక ఇలాంటి కామెంట్లు చేశాడని విమర్శిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

