YS Jagan : జగన్ ప్రెస్ మీట్ వెనక అసలు కుట్ర ఇదే..

YS Jagan : జగన్ ప్రెస్ మీట్ వెనక అసలు కుట్ర ఇదే..
X

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సడన్ గా నిన్న బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేశారు. ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టేసి పసలేని సబ్జెక్టును ఒకటి ఎంచుకున్నారు. ల్యాండ్ రీ సర్వే అంటూ కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తోందని అదంతా తన గొప్పే అంటూ ఏదో ఏదో మాట్లాడేశారు. అసలు ఒక ఊరికి ఎంతమంది సర్వేయర్లు ఉంటారో కూడా తెలియకుండా ఒక సీఎంగా పని చేసిన జగన్ మాట్లాడటం నిజంగా ఆయన అవివేకానికి నిదర్శనం అన్నట్టే ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ రీ సర్వే పేరుతో పాస్ పుస్తకాల మీద తన బొమ్మ వేసుకున్నాడు. హద్దురాళ్ల మీద కూడా జగన్ బొమ్మ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఎవరెవరికి భూమి హక్కులు లేవు వాళ్ళ భూమి కొట్టేయాలని కుట్రలు చేశాడు. కానీ ప్రజలు తిరగబడటంతో అదంతా ఆగిపోయింది. అయితే ఇప్పుడు దాన్ని తెరమీదకు తేవడానికి అసలు కారణం వేరే ఉంది.

ఎందుకంటే నిన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కాంలో అన్ని నిజాలను ఆయన బయటపెట్టారు. అంతిమ లబ్ధిదారుడు ఎవరు, లిక్కర్ పాలసీ వెనుక ఉన్నది ఎవరు, ఎవరికి ఆ డబ్బులు చేరాయి అనే విషయాలను మొత్తం ఆయన బట్టబయలు చేశారు. ఎలాగూ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు అనే విషయం మాజీ సీఎం జగన్ కు తెలుసు. కాబట్టి విజయసాయిరెడ్డి మాట్లాడేది మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ కావొద్దు అనే ఉద్దేశంతోనే జగన్ ఎంట్రీ ఇచ్చాడు. మీడియా సోషల్ మీడియా మొత్తం తన మాటల మీదనే రచ్చ జరగాలి తప్ప విజయసాయిరెడ్డి తన మీద చేసే ఆరోపణలు హైలెట్ కావొద్దు అనే ఉద్దేశంతోనే జగన్ ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టేశాడు.

ఒకరకంగా ఇదంతా డైవర్షన్ లో భాగమే అని తేలిపోయింది. ఎందుకంటే అసలు ఇప్పుడు ట్రెండింగ్ లో లేని భూముల రిసర్వేను తీసుకొచ్చి జగన్ మాట్లాడటం అంటే.. ఏదో ఒక విధంగా ప్రెస్ మీట్ పెట్టాలని ఆరాటమే కనిపిస్తోంది. కానీ జగన్ ఇలాంటి పసలేని ఆరోపణలు ఎన్ని చేసినా సరే ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఆయన మీద రోజు రోజుకు పెరుగుతున్న వ్యతిరేకతను చూసి ప్రజలు నమ్మట్లేదు.

Tags

Next Story