CM Chandrababu : జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు ట్వీట్

పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తెలుగుదేశం కుటుంబ సభ్యులకు’ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన జెండా. తెలుగువారిని అభివృద్ధి పథాన నడిపించిన జెండా. ‘‘అన్న’’ నందమూరి తారకరామారావు దివ్య ఆశీస్సులతో సంచలనంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. ఇలాంటి చారిత్రక రోజున ప్రజాసేవకు పునరంకితం అవుతామని సంకల్పం చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్’ అని ట్వీట్ చేశారు.
తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే ఎన్టీఆర్ 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. 9 నెలల్లోనే 294 అసెంబ్లీ సీట్లలో 202 గెలుచుకుని పార్టీ అధికారంలోకి వచ్చింది. రూ.2కే కిలో బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు వంటి కొత్త పథకాలతో పలు సంస్కరణలు తీసుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు పది సార్లు ఎన్నికలు జరగగా.. ఆరు సార్లు అధికారంలో, నాలుగు సార్లు ప్రతిపక్షంలో ఉంది.
సీఎం చంద్రబాబు అమరావతిలో ఇల్లు నిర్మించుకోనున్నారు. దీనికి ఏప్రిల్ 9న భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. గత ఏడాది చివర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలోని E6 రోడ్డుకు ఆనుకుని 5 ఎకరాల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ స్థలానికి, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు మధ్య 2కి.మీ దూరం ఉంటుంది. కాగా పీఎం మోదీ చేతుల మీదుగా త్వరలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com