PAWAN: వైసీపీకి ఓటేస్తే... కొరివితో తల గోక్కున్నట్లే

PAWAN: వైసీపీకి ఓటేస్తే... కొరివితో తల గోక్కున్నట్లే
ప్రజల ఆస్తులపై జగన్‌ కన్నేశారన్న పవన్‌... టైటిలింగ్ చట్టంతో ప్రజల ఆస్తులు గాల్లో దీపంలా మారుతాయని హెచ్చరిక

వైసీపీకి ఓటేస్తే... కొరివితో తల గోక్కున్నట్లే అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టిన జగన్... ఇప్పడు ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ను ప్రజలు అంగీకరిస్తే... దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనని ప్రజల ఆస్తులు గాల్లో దీపంలా మారుతాయన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె వారాహి విజయభేరి సభలో పాల్గొని ప్రసంగంచారు. వైకాపాను నేలమట్టం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టిన జగన్... ప్రజల ఆస్తులపై కన్నేశారని ఆరోపించారు. టైటిలింగ్‌ యాక్ట్‌ను అంగీకరిస్తే... దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. టైటిలింగ్ చట్టంతో ప్రజల ఆస్తులు గాల్లో దీపంలా మారుతాయని హెచ్చరించారు. వైసీపీని నేలమట్టం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పవన్‌ చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో వైసీపీ నేతలు ఆస్తులు కాజేయాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రతి ఓటమి దెబ్బ జనసేనను మరింత బలపడేలా చేసిందని పవన్‌ కల్యాణ్ అన్నారు. ఐదు కోట్ల మందికి జనసేన ధైర్యం నూరిపోసిందని చెప్పారు. రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని, దీని కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్నారు.


తర్వాత కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలోనూ పవన్‌ పాల్గొన్నారు. దాడులు, దోపిడీలు తప్ప ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని పవన్ ధ్వజమెత్తారు. ఆత్మగౌరవం దెబ్బతింటే ఎదురుతిరగాలనిపిస్తుందని.. తాను బతికి ఉండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనని పవన్‌ అన్నారు. దేశ ఐక్యతకు భంగం కలగనివ్వను. గులకరాయి పడితేనే జగన్‌ ఇంత పెద్ద డ్రామా ఆడారు. మా అక్కను వేధించొద్దు అన్నందుకు అమర్‌నాథ్‌గౌడ్‌ అనే బాలుడిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. బాధ్యత లేని వ్యక్తులు పదవుల్లో ఉంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. బలవంతులపై చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి.. బలహీనులపై చాలా బలంగా పనిచేస్తాయి. అమర్‌నాథ్‌ విషయంలో ఇదే జరిగిందన్నారు.

రేపల్లెను జూద స్థావరంగా మార్చారు. మట్టి మాఫియాలు, దోపిడీలు తప్ప అభివృద్ధి లేదు. భయపడితే సమాజంలో అభివృద్ధి జరగదన్నారు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు పెడతా. ఉపాధి అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం. పోలీస్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం. నిజాంపట్నం పోర్టును అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పిస్తాం. మహిళలకు చేయూతనందించి వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడతామని పవన్‌ భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story