Pawan Kalyan : కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న పవన్ కళ్యాణ్...!

X
By - TV5 Digital Team |8 May 2021 2:00 PM IST
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని జనసేన అధికారికంగా ప్రకటించింది.
సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని జనసేన అధికారికంగా ప్రకటించింది. కరోనా బారిన పడిన పవన్ కి వైద్య సేవలు అందించిన డాక్టర్స్... మూడు రోజుల కిందట నిర్వహించిన RTPCR పరీక్షలో నెగిటివ్ వచ్చిందని పేర్కొంది. కరోనా అనంతరం వచ్చే నిస్త్రాణం వంటివి మాత్రం ఉన్నాయని, ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది. కరోనా నుంచి పవన్ పూర్తిగా కోలుకోవాలని పూజలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్నందున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్న సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com