ఆంధ్రప్రదేశ్

ఏపీ డ్రగ్స్‌ హబ్‌గా మారింది.. వీడియో క్లిప్పింగులను ట్విట్టర్‌లో పోస్టు చేసిన పవన్..!

Pawan Kalyan : ఏపీలో గంజాయి వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది.. విపక్షాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి.

ఏపీ డ్రగ్స్‌ హబ్‌గా మారింది.. వీడియో క్లిప్పింగులను  ట్విట్టర్‌లో పోస్టు చేసిన పవన్..!
X

Pawan Kalyan : ఏపీలో గంజాయి వ్యవహారంపై దుమారం కొనసాగుతూనే ఉంది.. విపక్షాలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా జనసేనాని విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మాదక ద్రవ్యాల హబ్‌గా మారిందని ఆరోపించారు. ఏపీలోని గంజాయి ప్రభావం దేశవ్యాప్తంగా పడుతోందంటూ వ‌రుస‌ ట్వీట్లు చేశారు. ఏపీలో గంజాయి మూలాలున్నాయంటూ హైదరాబాద్‌ సీపీ, నల్గొండ ఎస్పీలు చేసిన ప్రెస్‌మీట్‌ వీడియో క్లిప్‌ల‌తో ట్వీట్లు చేశారు.. వీటితోపాటు దేశవ్యాప్తంగా గంజాయి ముఠాలు పట్టుబడిన ఉదంతాలను క్లిప్పింగ్‌ల రూపంలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఇక ఏపీ, ఒడిశా సరిహద్దులోని గిరిజన గ్రామాల్లో గతంలో తాను చేసిన యాత్రను పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగ పడిందని చెప్పారు. ఏవోబీలోని గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్, 'గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పవన్ పోస్ట్ చేశారు.


Next Story

RELATED STORIES