PAWAN: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నెలకో జిల్లా చొప్పున పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లేలా పవన్ ప్రణాళికలు చేసుకున్నారు. జిల్లాల్లోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలించేలా ప్లాన్ చేసుకున్నారు. ప్రజలతో నేరుగా పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.
వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్
గాలివీడు ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. ఇదే సమయంలో వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా.. ఇంకా వైసీపీ నేతలు గాల్లో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎవరి జాగీర్ కాదని, ముఠాలను పట్టుకుని బెదిరిస్తే ఎవరూ భయపడరని తెలిపారు. అతిగా ప్రవర్తిస్తే.. కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు.
నకిలీ ఐపీఎస్ అధికారిపై పవన్ రియాక్షన్
ఇటీవల మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు, ఒక నకిలీ ఐఏఎస్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నకిలీ పోలీస్ పై మీడియా ముఖంగా పవన్ స్పందించారు. "ఒక నకిలీ ఐపీఎస్ అధికారి నా చుట్టూ తిరిగాడని అంటున్నారు. అధికారి ఎవరనేది నాకు తెలియదు. ఈ అంశాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఇంటిలిజెన్స్, డీజీపీదేనని పవన్ పేర్కొన్నారు.
ఆటోలో పవన్ కూతురు ప్రయాణం
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటారనేది అందరికీ తెలిసిందే. అయితే, పవన్ కూతురు ఆద్య కూడా తన తండ్రినే అనుసరించి ట్రెండ్‌లో నిలిచారు. తాజాగా తల్లితో కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య.. ఓ ఆటో ప్రయాణిస్తూ కనిపించారు. ఈ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో తండ్రికి తగ్గ తనయ అంటూ ఆద్యపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com