Janasena: వాలంటీర్ల వ్యవస్థను విమర్శించిన పవన్

ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను మరోసారి విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నప్పడు వాలంటీర్లు ఎందుకు అని అడిగారు. విలువైన సమాచారాన్ని వాలంటీర్లు ఎందుకు సేకరిస్తున్నారని నిలదీశారు. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసంటూ ప్రశ్నించారు. వాలంటీర్లకు అవసరానికి మించి సమాచారం ఇవ్వద్దని.. వాలంటీర్ల వ్యవస్థ ప్రమాదకరంగా మారుతోందని పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల అదృశ్యంపై కేంద్ర నిఘావర్గాలు స్టడీ చేస్తున్నాయని తెలిపారు.
మహిళలు కనిపించకుండా పోతున్నారన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. కామెంట్లకు ఆధారాలు చూపించాలన్నారు.నిరాధార ఆరోపణలతో మహిళలను భయభ్రాంతులకు గురి చేయొద్దన్నారు.ఒకవేళ చేసిన వ్యాఖ్యలకు సమాధానాలు గానీ, ఆధారాలు గానీ ఇవ్వకపోతే వెంటనే మహిళలకు, వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com