Jawad Cyclone: ఉత్తరాంధ్రలో జవాద్ తుపాన్ ముప్పు.. ఈ శుక్రవారం నుండి..

Jawad Cyclone (tv5news.in)
Jawad Cyclone: ఉత్తరాంధ్ర జిల్లాలకు జవాద్ తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 4 నాటికి తుపానుగా మారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై ఎఫెక్ట్ చూపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్ 3, 4 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో పాటు గంటకు 80 కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దక్షిణ థాయ్‌లాండ్ పరిసర ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి..ఇవాళ వాయుగుండగా బలపడనుంది. శుక్రవారం తుఫానుగా మారనుంది. తర్వాత వాయువ్య దిశగా ప్రయాణించి నాలుగో తేది నాటికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాలను చేరే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com