పెన్షన్‌ ఇప్పిస్తే మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తా.. ఉషా శ్రీచరణ్‌ వ్యాఖ్యలకు జేసీ కౌంటర్‌

పెన్షన్‌ ఇప్పిస్తే మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తా.. ఉషా శ్రీచరణ్‌ వ్యాఖ్యలకు జేసీ కౌంటర్‌
X
JC Prabhakar Reddy : అనంతపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు..

JC Prabhakar Reddy : అనంతపురం మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు.. మంత్రి ఉషా శ్రీచరణ్‌ వ్యాఖ్యలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.. శవరాజకీయాలు చేస్తోంది వైసీపీ వాళ్లంటూ నిప్పులు చెరిగారు.. తాడిపత్రికి వచ్చిన తనమీద విమర్శలు చేయడం కాదన్నారు.

చనిపోయిన పాప తండ్రి వికలాంగుడని.. ఆయనకు పెన్షన్‌ ఇప్పించాలన్నారు. పెన్షన్‌ ఇప్పిస్తే మీ ఇంటికి వచ్చి సన్మానం చేస్తానంటూ తనదైన శైలిలో కామెంట్స్‌ చేశారు జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. విమర్శలు మీకంటే గట్టిగానే చేయగలను.. మొత్తం చెప్పగలను అంటూ ఫైరయ్యారు.

కర్నాటక లోకాయుక్త, సుప్రీంకోర్టు కేసుల విషయం చెప్పమంటారా అంటూ మంత్రి ఉషాశ్రీ చరణ్‌ను టార్గెట్‌ చేస్తూ కామెంట్స్‌ చేశారు.

Tags

Next Story