Jogi Brothers : జోగి బ్రదర్స్ కు బిగుసుకుంటున్న ఉచ్చు..!

ఏపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన కల్తీ లిక్కర్ కేసు గురించి ఇంకా ఎవరు మర్చిపోలేరు. వైసిపి నేతలు అత్యంత దుర్మార్గంగా వందలాదిమంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కోట్లు సంపాదించిన కల్తీ లిక్కర్ కేసు ఇది. తనకేం సంబంధం లేదు అంటూ పెద్ద బిల్డప్ ఇచ్చి ప్రమాణాల మీద ప్రమాణాలు చేసిన జోగి బ్రదర్స్ ఇప్పుడు కటకటాల్లో ఉన్నారు. వాళ్ల ప్రమేయం ఉందని అద్దేపల్లి జనార్దన్ రావు స్వయంగా బయటపెట్టాడు. అంతేకాకుండా జోగి బ్రదర్స్ కు పెద్ద ఎత్తున డబ్బు మూటలు వెళ్లినట్లు సిట్ అధికారులు సాక్షాలతో సహా గుర్తించారు. ఇంత అడ్డంగా దొరికిపోయినా సరే దేవుడు అంటే భయం లేకుండా ప్రమాణాలు చేయడం జోగి రమేష్ కే చెల్లింది. అయితే ఈ కేసు కేవలం జోగి బ్రదర్స్ కు మాత్రమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా చుట్టుకుంటుంది.
ఎందుకంటే కోట్లు సంపాదించడంలో జోగి బ్రదర్స్ ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయింది. కల్తీ లిక్కర్ కేసులో జోగి బ్రదర్స్ తో పాటు వాళ్ళ నలుగురు కుమారులు కూడా ప్రమేయం ఉందని సిట్ అధికారులు గుర్తించారు. అందుకే జోగి రమేష్ కొడుకులు రోహిత్, రాజీవ్ తో పాటు రాములు కొడుకులు రాకేష్, రామ్మోహన్ లకు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. సిఐడి ఆఫీసుకు విచారణకు రావాలంటూ ఆదేశించారు. కల్తీ లిక్కర్ కేసులో వాళ్లు ఎలా పాలుపంచుకున్నారు, డబ్బు మూటలను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు, వాటిని ఏం చేశారు, ఎవరు చెబితే ఈ దందాలోకి వాళ్ళు వచ్చారు అనే కోణంలో సిట్ విచారించబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ కల్తీ లిక్కర్ కేసులో అంతిమలాబ్దిదారుడు గురించి ఎప్పటినుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జోగి కుమారులు ఆ డబ్బు మూటలను ఏం చేశారు అనేది తెలిస్తే ఇందులో అంతిమ లబ్ధిదారుడి గురించి తెలిసి అవకాశాలు ఉన్నాయి. మొదట్లో తమకు అసలు లిక్కర్ అంటేనే తెలియదని.. తమ ఫ్యామిలీ అలాంటిది కాదని.. తాము అత్యంత పవిత్రులం అన్నట్లు బిల్డప్ ఇచ్చిన జోగి ఫ్యామిలీ చుట్టూ ఈ కేసు ఉచ్చు బిగుస్తోంది. పాపం చేసినవాళ్లు ఎన్నో సంవత్సరాలు తప్పించుకుని తిరగలేరు కదా. ఎప్పటికైనా పాపం పండాల్సిందే వాళ్ళ బాగోతం బయటపడాల్సిందే. ఇప్పుడు జోగి ఫ్యామిలీ విషయంలో ఇదే జరుగుతోంది. వైసీపీ హయాంలో జోగి రమేష్ ఏ స్థాయిలో రెచ్చిపోయి ప్రతిపక్ష నేతలను అత్యంత దారుణంగా అవమానించాడో మనం చూసాం. ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా ఇలాంటి కల్తీ లిక్కర్ దందాను నిర్వహించినందుకు ఆయన ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

