ACB Raids : ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్

ACB Raids : ఏసీబీ కోర్టులో జోగి రాజీవ్ బెయిల్ పిటిషన్
X

అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. నిన్న రమేశ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు అనంతరం రాజీవ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

జప్తులో ఉన్న అగ్రిగోల్డ్‌ భూముల్ని కబ్జాచేసి వేరొకరికి విక్రయించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ తనయుడు రాజీవ్‌కు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. విజయవాడ జిల్లా జైలుకు తరలించాలని ఆదేశించింది.

ప్రభుత్వ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్‌ భూముల కబ్జా, విక్రయం వెనక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధరించారు. ఈ వ్యవహారంపై 2023లోనే ఫిర్యాదులు అందినా అధికారులు తొక్కి పెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చేసి రికార్డులు తారుమారు చేశారు.

Tags

Next Story