Jogi Ramesh : జోగి రమేష్ ది అక్రమ అరెస్ట్ కాదు.. సక్రమమే

అంతా అనుకున్నట్టే జరిగింది. అందరూ ఊహించినట్టే వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. చాలా హైడ్రామా తర్వాత జోగి రమేష్, ఆయన సోదరుడు రామును అరెస్టు చేశారు. అయితే చాలామంది వైసిపి నేతలు ఇది అక్రమ అరెస్టు అంటూ రకరకాల ప్రచారాలు అప్పుడే మొదలు పెట్టేశారు. అంటే వైసిపి నేతల ఉద్దేశం ప్రకారం తప్పు చేసిన వారిని అరెస్టు చేయకూడదా.. సిట్ అధికారులు ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయలేదు కదా. జోగి రమేష్ కు చెందిన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే జోగి రమేష్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ దే అసలు పాత్ర అని సిట్ అధికారులకు కూడా ముందు తెలియదు. జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చేవరకు జోగి రమేష్ పేరు అంతగా బయటకు రాలేదు. అలాంటప్పుడు ఇందులో కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర ఏముంది.. జనార్ధన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా అధికారులు వీడియో చిత్రీకరించారు.
ఎందుకంటే ఎలాంటి సాక్షాలు చూపించకుండా అరెస్టు చేస్తే ప్రజల్లో కూడా ఒకంత తప్పుడు ప్రచారం జరుగుతుంది. అందుకే సిట్ అధికారులు ముందు నుంచే ఈ కేసులో జోగి రమేష్ కీలక సూత్రధారి పాత్రధారి అని ఆధారాలు కూడా బయటపెట్టారు. జోగి రమేష్ ముందు తనకు జనార్దన్ రావు అంటే తెలియదన్నాడు. అప్పుడే జోగి రమేష్ తో జనార్దన్ రావు కలిసి మాట్లాడిన కొన్ని వీడియోలను విడుదల చేశారు.
అంటే జోగి రమేష్ పాత్ర ఉందని ముందు నుంచే అధికారులు హింట్ ఇస్తూ వచ్చారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్టు తప్పదు అనే సంకేతాలను ముందు నుంచే ప్రజలకు ఇస్తూ వచ్చారు సిట్ అధికారులు. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా అరెస్ట్ చేస్తే దాన్ని అక్రమ అరెస్ట్ అనాలి. అంతేగాని ముందు నుంచే సమాచారం ఇస్తూ సాక్ష్యాలను చూపిస్తూ అరెస్ట్ చేశాక కూడా.. వైసిపి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

