TG : విద్యుత్‌ కమిషన్‌ కొత్త చైర్మన్‌గా జస్టిస్‌ లోకూర్‌

TG : విద్యుత్‌ కమిషన్‌ కొత్త చైర్మన్‌గా జస్టిస్‌ లోకూర్‌
X

విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్‌రావు లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది. గతంలో ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ నరసింహారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ స్థానం నుంచి తప్పుకున్నారు. దీంతో కొత్త చైర్మన్‌గా ప్రభుత్వం లోకూర్‌ను ఎంపిక చేసింది. లోకూర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు సీజేగా పనిచేశారు. కాగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ల నిర్మాణాల్లో అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ వేసిన విషయం తెలిసిందే.

Tags

Next Story