KA Paul : ఏపీ హైకోర్టులో కేఏ పాల్ పిల్ దాఖలు..!

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఏపీ హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పిల్ దాఖలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టును కోరారు. కేఏ పాల్ తరఫున జ్యోతిబగల్ పిటిషన్ దాఖలు చేశారు. కేపిటల్ మైనింగ్ అంశంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు లీజు పర్మిషన్ వచ్చేలా చూడాలని కేఏ పాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి విరాళాలు సేకరిస్తానన్నారు. సీఎం జగన్ కేంద్రానికి రాసిన లేఖను పిటిషన్‌లో కేఏ పాల్ ప్రస్తావించారు. ప్రతివాదులుగా కేంద్ర మైనింగ్ డిపార్ట్‌మెంట్, కేంద్ర ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, విశాఖ స్టీల్ ప్లాంట్, కేంద్ర స్టీల్ డిపార్ట్‌మెంట్, ఏపీ సీఎస్‌ను చేర్చారు. పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com