అమరావతికి మద్దతుగా కాగడాల ప్రదర్శన
By - kasi |22 Oct 2020 3:51 PM GMT
అమరావతికి మద్దతుగా కృష్ణా జిల్లా గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.. అటు.. మందడంలో రైతులు కాగడాల ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఉద్దండరాయునిపాలెంలో పోలీసులు బలవంతంగా దీక్షా శిబిరం నుంచి బయటకు పంపడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి సాధించేవరకు ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com