కాకినాడ జిల్లాలో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్

కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం శివారులో, డ్రగ్స్ కంపెనీ పెట్టిన ప్రజాభిప్రాయ సేకరణకు వెళుతున్న, టీడీపీ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం అన్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. కాలుష్య పరిశ్రలు నిర్మించి మత్స్యకారుల పొట్టకొడుతున్నారన్నారు.
మాలపేట వద్ద పిఠాపురం మాజీ ఎమ్మెల్యేను వర్మను సైతం అడ్డుకున్నారు పోలీసులు. తొండంగి మండలం ఏవీ నగరం శివారులో, పర్యావరణ ప్రజాభి సేకరణ చేపట్టారు అధికారులు. డెవలప్ మెంట్ ఆఫ్ కాకినాడ సెజ్ మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్, నిర్మాణం కొరకు కలెక్టర్ ఆధ్వర్యంలో, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిర్మాణ ప్రదేశానికి సమీప గ్రామాల ప్రజలు చేరుకుని, పరిశ్రమ నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు స్థానికులు. గతంలో కెమికల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేఖం అని చెప్పిన జగన్, ఇప్పుడు ఇలా చేయడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com