Kakinada : కాకినాడలో నాటు సారా కలకలం.. సీజ్ చేసిన పోలీసులు

Kakinada : కాకినాడలో నాటు సారా కలకలం.. సీజ్ చేసిన పోలీసులు
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్తీ సారాపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోగజకవర్గంలో పోలీసులు నాటు సారా పట్టుకున్నారు. ప్రత్తిపాడు గ్రామ శివారులోని పెట్రోల్‌ బంక్‌ దగ్గర్‌ అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. సుమారు 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమంగా నాటు సారా కాస్తున్న వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్య తెలిపారు.

Tags

Next Story