AP New DGP: ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి బాధ్యతలు..
AP New DGP: డీజీపీగా గౌతమ్ సవాంగ్‌కు గౌరవప్రదమైన వీడ్కోలు ఇచ్చి.. కొత్త డీజీపీగా కసిరెడ్డికి బాధ్యతలు అప్పగించనున్నారు. మరికాసేపట్లో మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు రాజేంద్రనాథ్‌రెడ్డి. ఇదే సందర్భంలో గౌతమ్ సవాంగ్‌కు పోలీస్ ఉన్నతాధికారులు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ గురువారమే ఫైలు తయారు చేసింది ఏపీ ప్రభుత్వం. నిన్న ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించారు. నిన్న రాత్రి ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్ నియామకంపై గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. అయితే ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఎదురయ్యే ఇబ్బందుల గురించి గౌతమ్ సవాంగ్ అడిగినట్లు తెలిసింది.
దీంతో వీఆర్‌ఎస్‌తో సంబంధం లేకుండా డీమ్డ్ టు బి రిటైర్డ్ అనే నిబంధనను వాడుతూ గౌతమ్ సవాంగ్‌కు కమిషన్ ఛైర్మన్ పదవి అప్పగిస్తున్నారు. డీమ్డ్ టు బి రిటైర్డ్ నిబంధన వల్ల ఐపీఎస్‌గా సవాంగ్‌కు రావాల్సిన సర్వీస్ ప్రయోజనాలన్నీ పూర్తిగా వస్తాయని చెబుతున్నారు. మొత్తానికి గౌతమ్ సవాంగ్ అలగకుండా.. ఆయన్ను బుజ్జగించి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి అప్పగించారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
గౌతమ్ సవాంగ్ సర్దుకుపోయారు గాని.. ప్రవీణ్ ప్రకాష్ అలా సర్దుకుపోయేందుకు సిద్ధంగా లేరన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్‌గా ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పటికే, ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా.. ఇప్పటికీ సీఎం పేషీలోనూ ఉన్నట్టు కొందరు అధికారులు చెబుతున్నారు.
తాను సీఎం పేషీలో కొనసాగుతూ, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నట్లు ప్రవీణ్ ప్రకాష్ ప్రభుత్వ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం పేషీలో కొనసాగించేలా జగన్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో సీఎం నిర్ణయమే ఫైనల్ అని, ప్రభుత్వ నిర్ణయంలో మార్పు ఉండకపోవడంతో ప్రవీణ్ ప్రకాష్ సైతం ఢిల్లీ వెళ్లేందుకే సిద్ధమవుతున్నారని మాట్లాడుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com