Kerala Coastal Dogs : టన్నెల్ లోకి కేరళ కడవల్ డాగ్స్.. ఏం చేస్తాయంటే?

ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కు కున్న ఎనిమిది మంది ఆచూకీ కోసం ఎన్నిరకాల అధునాతన పద్ధతులుంటే అన్నింటిని, అలాగే ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని సర్కార్ వినియోగిస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల వద్ద 18వ రోజు సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. మానవ రహిత సహాయక చర్యలు కూడా గురువారం ప్రారం భమయ్యాయి. ఇప్పటికే రోబోటిక్స్, సిస్మాలజీ బృందాలు రంగంలోకి దిగాయి. బురద, నీళ్లలో ఉన్న మనిషి ఆనవాళ్లు గుర్తించగల కడవల్ డాగ్స్ను కేరళ నుంచి తెప్పించారు. గురువారం కేరళ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న డాగ్స్ను ఆర్మీ హెలికాప్టర్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు తీసుకువచ్చారు. నీరు, బురద లోనూ మనుషుల ఆన వాళ్లను గుర్తించేలా కె.9 కేరళ పోలీసులు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఈ డాగ్స్ ఎనిమిది మంది ఆచూకీ లభ్యం అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. వీటికి మాయ, మర్ఫీ నామకరణం చేశారు. శుక్రవారం ఉదయం నుంచి డాగ్స్ సేవలు వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీబీఎం మిషన్ పై పెద్ద ఎత్తున పేరుకు పోయిన బురదను వాటర్ జట్ల ద్వారా శుభ్రపరుస్తున్నారు. అయితే బురద కూడా గట్టిపడిందని అధికారులు చెబుతున్నారు. రాడార్ ద్వారా గుర్తించిన ఎనిమిది కేంద్రాల్లో నాలుగు కేంద్రాల వద్ద తవ్వకాలు జరుగుతున్నాయి. బురద తొలగింపునకు ఒకవైపు మిషనరీలతోపాటు సింగరేణి కార్మికులను అధికారులు వినియోగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ కు పూర్తి స్థాయి మరమ్మతులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి కన్వేయర్ బెల్ట్ కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నది. సొరంగంలో నుంచి వస్తున్న దుర్వాసన కూడా రెస్క్యూ సిబ్బందికి కొంత ఇబ్బంది కలిగిస్తోంది. సహాయక చర్యలలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ వైభవ గైక్వాడ్ రఘునాథ్, డోగ్ర రెజిమెంట్ కమాన్డెంట్ పరిక్షిత్ మెహ్రా, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్న, జయప్రకాష్ అసోషియేట్ యం.డి. పంకజ్ గౌర్ తదితరులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com