AP : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన

AP : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన
X

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తల్లికి వందనం స్కీమ్‌కు ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు. పేదరికం కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేుటు పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ముఖ్యంగా, సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా త్వరలోనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. అదేవిధంగా దీపం-2 పథకం ద్వారా గృహిణులకు ప్రతి యేటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 5 లక్షల మంది గృహిణులకు లబ్ది పొందుతున్నారని మంత్రి పయ్యావుల అసెంబ్లీలో వెల్లడించారు.

Tags

Next Story