Polavaram Project : పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం..స్టే రింగ్స్ ఏర్పాటు

Polavaram Project : పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం..స్టే రింగ్స్ ఏర్పాటు
X

ఆంధ్రప్రదేశ్ జల వర ప్రదాయని ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టానికి అధికారులు శ్రీకారం చుట్టారు. పోలవరం ఇరిగేషన్‌ ప్రాజక్టులో కీలకమైన జలవిద్యుత్‌ కేంద్రం టర్బైన్ల ఏర్పాటులో స్టే రింగ్‌ల అమరిక పనులను ప్రారంభించారు. ఈ అమరికకు 320 టన్నుల సామర్ధ్యం కలిగిన క్రాలర్‌ క్రేన్‌ వినియోగించారు. స్టే రింగ్ అమరిక పనుల ప్రారంభ సందర్భంగా పూజా కార్యక్రమం చేపట్టారు. ప్రాజెక్టులో ఈ స్టే రింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కో స్టే రింగ్ 4 విభాగాలుగా ఉంటుంది. దీని బరువు 136 మెట్రిక్ టన్నులు. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే కప్లాన్ టర్బైన్ లు సమర్ధవంతంగా పనిచేయడంలో ఈ స్టే రింగ్‌లు కీలక పాత్ర పోషిస్తాయి.

Tags

Next Story